ఆర్ఆర్ఆర్ టైటిల్ రివీల్.. మరీ ఇంత గ్రాంధికమా..!!?

ఆర్ఆర్ఆర్ టైటిల్ రివీల్.. మరీ ఇంత గ్రాంధికమా..!!?

రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి.  ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ సినిమా టైటిల్ పై అనేక అంచనాలు ఉన్నాయి.  నెటిజన్లు ఈ సినిమా టైటిల్ పై అనేక అభిప్రాయాలను ఇప్పటికే పంచుకున్నారు.  రామ రావణ రాజ్యం ఇలా ఎన్నో టైటిల్ ను అనుకున్నారు.  

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్ ను రామ రౌద్ర రిషితం అనే టైటిల్ ను అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.  ఈ టైటిల్ ను కన్ఫర్మ్ చేసినట్టు సమాచారం.  ఇక విదేశాల్లో రైజ్ రివోల్ట్ రివెంజ్ పేరుతో విడుదల చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ సినిమా టైటిల్ విషయంపై అధికారికంగా వార్తలు వెలువడాల్సి ఉన్నది.  దసరా రోజున ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేసే అవకాశం ఉంది.  అక్టోబర్ 22 వ తేదీన కొమరం భీమ్ జయంతి కావడంతో ఆ రోజున ఎన్టీఆర్ కొమరం భీమ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.  పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా అలియా నటిస్తోంది.  ఎన్టీఆర్ కు జోడిగా ఎవరు చేస్తున్నారు అన్నది తెలియాల్సి ఉంది.