#RRR ఫైట్ సీన్ ఇలా ఉంటుందట..!!

#RRR ఫైట్ సీన్ ఇలా ఉంటుందట..!!

ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ నవంబర్ 19 వ తేదీన ప్రారంభమైంది.  ఫస్ట్ షెడ్యూల్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు సంబంధించిన ఫైట్ సీన్స్ తో స్టార్ట్ చేస్తున్నారు.  ఇప్పటికే ఈ ఫైట్ సీన్స్ కు సంబంధించిన షూట్ చాలా వరకు కంప్లీట్ అయినట్టుగా సమాచారం.  ఎన్టీఆర్ పఠాన్ దుస్తుల్లో రఫ్ గా కనిపిస్తే.. చరణ్ మోడ్రన్ దుస్తుల్లో స్టైలిష్ గా కనిపించాడని సమాచారం.  ఈ ఇద్దరిపైన వాటర్ ఫైట్ ను చిత్రీకరించారని తెలుస్తున్నది.  ఈ ఫైట్ సీన్ సినిమాకు హైలైట్ అవుతుందని అంటున్నారు.  

ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోయిన్ల గురించి ఇంకా సమాచారం బయటకు రావడం లేదు.  రష్మిక, మహానటి హీరోయిన్ కీర్తి సురేష్, పూజా హెగ్డే పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం.  జాన్వీ కపూర్ కూడా ఇందులో నటించే అవకాశాలు ఉన్నాయట.