ఆర్ఆర్ఆర్ లో ఆ ఫైట్... విజువల్ వండర్... ఎవరిదో తెలుసా? 

ఆర్ఆర్ఆర్ లో ఆ ఫైట్... విజువల్ వండర్... ఎవరిదో తెలుసా? 

ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చే ఏడాది జనవరి 8 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  మాములుగా ఈ ఏడాది జులై 30 వ తేదీన రిలీజ్ కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వలన సినిమా వాయిదా వేశారు.  అయితే, ప్రస్తుతం కరోనా ప్రభావం కారణంగా సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి.  ఇకపోతే ఇందులో ఓ ఫైట్ సీన్ ఉందట.  ఆ సీఎం విజువల్ వండర్ గా ఉంటుందని అంటున్నారు.  

ఈ ఫైట్ సీన్ ను ట్రైన్ మీద చిత్రీకరించారని తెలుస్తోంది.  నవాబులు ఆయుధాలను రైల్లో తీసుకెళ్తుండగా, ఆ రైలుపై దాడిచేసి ఆయుధాలను దోచుకెళ్లే సీన్ ను షూట్ చేశారట.  ఈ సీన్ విజువల్ పరంగా వండర్ గా ఉన్నట్టు తెలుస్తోంది.  ఈ ఫైట్ సీన్ లో ఎన్టీఆర్ యాక్షన్ సూపర్బ్ గా ఉండబోతుందని అంటోంది యూనిట్.