'ఆర్ఆర్ఆర్' రైట్స్ 65 కోట్లు

'ఆర్ఆర్ఆర్' రైట్స్ 65 కోట్లు

ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్' కూడా ఉంది.  ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్నారు.  ప్రసుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా హక్కుల కోసం పోటీ ఎక్కువగానే ఉంది.  ఎంత మొత్తంగా చెల్లించేందుకు డిస్ట్రిబ్యూటర్లు సిద్ధంగా ఉన్నారు.  తాజాగా ఈ చిత్ర ఓవర్సీస్ హక్కుల్ని బడా డిస్ట్రిబ్యూటర్ ఒకరు 65 కోట్ల పెద్ద మొత్తం చెల్లించి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.  ఇక తెలుగు రాష్ట్రాల హక్కుల ధరలైతే ఆకాశాన్ని తాకుతున్నాయి.  వచ్చే ఏడాది ఆఖరులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.