చరణ్, ఎన్టీఆర్.. ఇక సర్దుకోండి !

చరణ్, ఎన్టీఆర్.. ఇక సర్దుకోండి !

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి స్టార్ట్ చేసిన భారీ మల్టీస్టారర్ ఒక షెడ్యూల్ పూర్తిచేసుకుంది.  మధ్యలో కుమారుడి పెళ్లి ఉండటంతో కాస్త బ్రేక్ ఇచ్చిన రాజమౌళి హడావుడి మొత్తం ముగియడంతో మళ్ళీ చిత్రీకరణ మొదలుపెట్టనున్నారు.  ఈ నెల 21 నుండి కొత్త షెడ్యూల్ మొదలుకానుంది.  ప్రెజెంట్ చరణ్ ప్రమోషన్లలో బిజీగా ఉండగా తారక్ వర్కవుట్స్ చేస్తూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు.  మొదటి షెడ్యూల్ ను త్వరగానే ముగించిన జక్కన్న ఈ రెండవ షెడ్యూల్ ను మాత్రం ఎక్కువ రోజులే కొనసాగిస్తాడని తెలుస్తోంది.