ఆర్ఆర్ఆర్ కొత్త షెడ్యూల్ ఏంటి..

ఆర్ఆర్ఆర్ కొత్త షెడ్యూల్ ఏంటి..

తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సినిమాల్లో ఆర్ఆర్ఆర్ టాప్‌లో ఉంటుంది. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్‌టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అదేవిధంగా బాలీవుడ్ నటులు అజయ్ దేవగన్, అలియా భట్ మరికొందరు కొన్ని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికీ ఈ సినిమాలోని ప్రధాన పాత్రలను ఉద్దేశించి విడుదల చేసిన రెండు ట్రైలర్లు కూడా భారీగా ప్రజాదరణ పొందాయి. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందే చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాకు మరింత సందడి చేకూర్చేందుకు జక్కన్న మరో కొత్త ప్లాన్‌తో ముందుకొస్తున్నాడని అందులో బాగంగా ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ మరికొన్ని భాషల్లో రూపొందుతోంది. అయితే ఈ సినిమాకి ఏభాషలో ఆ భాష చిత్రపరిశ్రమలో ప్రముఖుల చేత వాయిస్ చెప్పించాలని రాజమౌళి ఆలోచన చేస్తున్నారట. ఇదిలా ఉంటే ఈ సినిమా చిత్ర బృందం ఇటీవల ఒక యాక్షన్ సీక్వేన్స్ చిత్రీకరణను పూర్తిచేసుకొంది. దీనికి ఆర్ఆర్ఆర్ టీమ్ దాదాపు 50రోజుల షూటింగ్ చేసింది. ఈ షూటింగ్ షెడ్యూల్ పూర్తి కావడంతో మరో కొత్త షెడ్యూల్‌ను టీమ్ రూపొందించనుంది. కొత్త షెడ్యూల్ కోసం అందరూ సన్నద్దం అవుతున్నారు.