వడోదరకు పయనమైన ఆర్ఆర్ఆర్ టీమ్

వడోదరకు పయనమైన ఆర్ఆర్ఆర్ టీమ్

ఆర్ఆర్ఆర్ మూవీ సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో పూర్తి చేసుకుంది.  ఈ షెడ్యూల్ పూర్తైన వెంటనే యూనిట్ నార్త్ ఇండియాలో జరిగే లాంగ్ షెడ్యూల్ కు బయలుదేరింది.  ఇప్పటికే యూనిట్ గుజరాత్ లోని వడోదరకు చేరుకోగా.. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కొద్దిసేపటి క్రితమే వడోదరకు పయనమయ్యారు.  

వడోదరకు వెళ్తున్న విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొన్నాడు.  రామ్ చరణ్, ఎన్టీఆర్ ల ఇండిగో ఫ్లైట్ టికెట్స్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.  వడోదరలో జరిగే బిగ్ షెడ్యూల్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో పాటు హీరోయిన్లు కూడా జాయిన్ అవుతారని తెలుస్తోంది.