'ఆర్ఆర్ఆర్' టైటిల్ రివీల్ అయ్యేది ఆరోజే

'ఆర్ఆర్ఆర్' టైటిల్ రివీల్ అయ్యేది ఆరోజే

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'.  సుమారు 350 కోట్ల వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమాను దానయ్య నిర్మిస్తున్నారు.  ప్రస్తుతం ఈ సినిమా యొక్క ఇంటర్వెల్ బ్లాక్ షూటింగ్ జరుగుతోంది.  ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఆగష్టు 15వ తేదీన రిలీజ్ కానుంది.  అలాగే టైటిల్ కూడా అదే రోజున బయటకురానుంది.  దీంతో ఇన్నాళ్లు ప్రేక్షకుల్లో ఉన్న 'ఆర్ఆర్ఆర్' అంటే ఏమిటనే ఉత్కంఠకు తెరపడనుంది.  అలాగే ఇందులో ఎన్టీఆర్ సరసన కథానాయిక ఎవరనే విషయంపై కూడా త్వరలోనే ఒక క్లారిటీ రానుంది.