నార్త్ ఇండియాలో 'ఆర్ఆర్ఆర్' !

నార్త్ ఇండియాలో 'ఆర్ఆర్ఆర్' !

త్వరలో కలకత్తాలో షూటింగ్ జరుపునున్న 'ఆర్ఆర్ఆర్' టీమ్ ఇంకొన్ని ఉత్తరాది ప్రాంతాలను కూడా ఎంచుకుంది.  పూణే, అహ్మదాబాద్ లాంటి నగరాల్లోని కొన్ని ఐకానిక్ లొకేషనల్లో చిత్రీకరణ జరపనున్నారు.  దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను పాన్ ఇండియన్ సినిమాగా తీర్చిదిద్దనున్నారు.  

రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరికీ సమానమైన ప్రాముఖ్యత కలిగిన కథతో ఈ చిత్రం రూపొందుతోంది.  సుమారు 400 కోట్ల బడ్జెట్ కేటాయించబడిన ఈ సినిమాలో అజయ్ దేవగన్, అలియా భట్ లాంటి బాలీవుడ్ స్టార్లు నటించనున్నారు.