ఆర్ఆర్ఆర్‌లో ఇంగ్లీష్ పాట.. వారిని ఆకర్షించడానికేనట?

ఆర్ఆర్ఆర్‌లో ఇంగ్లీష్ పాట.. వారిని ఆకర్షించడానికేనట?

ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా ఉన్న సినిమాల్లో జక్కన్న చేస్తున్న ఆర్ఆర్ఆర్ కూడా ఒకటి. ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాని యంగ్ టైగర్ ఎన్‌టీఆర్, రాంచరణ్‌లు హీరోలుగా జక్కన్న రూపొందిస్తున్నాడు. ఇప్పటికే రెండు సార్లు ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. ఇటీవల ఈ సినిమాను దసరాకు విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఈ సినిమాలోని పాటలు, బ్యాక్‌గ్రైండ్ మ్యూజిక్ సన్నివేశాలకు ప్రాణం పోస్తాయని, సినిమాలో అవి కూడా కీలక పాత్ర పోషించనున్నాయన తెలిపారు. ఈ సినిమా విడుదల గురించి వచ్చిన వార్తలను కొందరు దీనిని కూడా కొట్టిపారేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ చిన్న ఇంగ్లీషు పాట కూడా ఉండనుందట. ఈ పాట ఎన్‌టీఆర్‌పై ఆసక్తిగా ఉన్న ఒలీవియా మొర్రిస్ పాత్రకు ఉందనుదని వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ఈ పాట ద్వారా అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులను ఆకర్షించేందుకే జక్కన్న ప్లాన్ చేస్తున్నాడాని అంటున్నారు. హాలీవుడ్ రేంజ్‌లో కూడా భారీ వసూళ్లను రాబట్టేందుకే రాజమౌలి ఈ ప్లాన్ చేశాడట. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.