మెట్రో ప్రమాదంపై కేటీఆర్ సీరియస్.. మౌనిక ఫ్యామిలీకి రూ.20 లక్షల పరిహారం

మెట్రో ప్రమాదంపై కేటీఆర్ సీరియస్.. మౌనిక ఫ్యామిలీకి రూ.20 లక్షల పరిహారం

హైదరాబాద్ మహా నగరానికి మణిహారంగా భావిస్తున్న మెట్రో రైలు స్టేషన్ దగ్గర అనుకోని ప్రమాదం పెద్ద చర్చగా మారింది. అమీర్‌పేట్ మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర పెచ్చులూడిపడి మౌనిక అనేక వివాహిత మృతిచెందడం విషాదాన్ని నింపించింది. అయితే, ఈ ఘటనపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్.. నిన్న అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో జరిగిన ఘటన, మౌనిక అనే మహిళ మృతిచెందడం దురదృష్టకరమని పేర్కొన్న ఆయన.. ఆమె కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. స్వతంత్ర ఇంజనీరింగ్ నిపుణులు క్షుణ్ణంగా పరిశోధించి.. అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

మరోవైపు ఈ ప్రమాదంలో ప్రాణాలుకోల్పోయిన మౌనిక కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ప్రకటించారు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై మీడియాతో మాట్లాడియన ఎన్వీఎస్ రెడ్డి.. అమీర్‌పేట్ మెట్రో ఘటనపై రాష్ట్రప్రభుత్వం సీరియస్ అయ్యిందని.. స్వతంత్ర ఇంజనీరింగ్ నిపుణులు క్షుణ్ణంగా పరిశోధించి..అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ఆదేశించినట్టు తెలిపారు. ఈ ప్రమాదాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని.. అన్ని స్టేషన్ల నిర్మాణాలు, సౌకర్యాలను సూక్ష్మంగా తనిఖీ చేయాలని.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు. మృతురాలు మౌనిక కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారం చెల్లించే ఒప్పందంపై ఎల్ అండ్ టీ సంతకం చేసినట్టు తెలిపారు ఎన్వీఎస్ రెడ్డి.