ఈవీఎంల కొనుగోలుకు రూ. 4,500 కోట్లు కావాలి

 ఈవీఎంల కొనుగోలుకు రూ. 4,500 కోట్లు కావాలి

లోక్ సభ, అసెంబ్లీలకు ఒకే సారి ఎన్నికలు జరిగితే తక్షణమే కొత్త ఈవీఎంలు కొనేందుకు సుమారు రూ. 4,500 కోట్లు కావాలని కేంద్ర లా కమిషన్ సూచించింది. గత వారం ఎన్నికల నిర్వహణపై లా కమిషన్ జారీ చేసిన నివేదిక ప్రకారం 2019 సాధారణ ఎన్నికలకు సుమారు 10,60,000 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్నికల కమిషన్ తెలపింది.

జమిలీ ఎన్నికల కోసం 12.9 లక్షల బ్యాలెట్ యూనిట్లు, 9.4 లక్షల నియంత్రణ యూనిట్లు 12.3 లక్షల  ఆడిట్ ట్రైల్ యంత్రాలు కావాలని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఇవన్ని కొనడానికి ఒక్కో దానికి రూ. 33,200 ఖర్చు అవుతుందని పేర్కోంది. ఈవీఎం జీవిత కాలం సగటున 15 సంవత్సరాలు ఉంటుందని తెలిపింది. 2024లో జమిలి ఎన్నికల కోసం రూ.1751.17 కోట్లు, 2029 ఎన్నికలకోసం రూ. 2017.93 కోట్లు అవసరమని ఎన్నికల సంఘం తెలిపింది.