ఎల్లుండి నుండి జన్ ధన్ ఖాతాల్లో రూ.500.!

ఎల్లుండి నుండి జన్ ధన్ ఖాతాల్లో రూ.500.!

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద జన్ ధన్ ఖాతాలు ఉన్న మహిళల అకౌంట్లలో మరో విడత రూ.500 జమ కానున్నాయి. జూన్ 5 నుండి జూన్ 10 వరకు వారి ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. లాక్ డౌన్ కారణంగా ప్రజలను ఆర్థికంగా ఆదుకోడానికి కేంద్రం అందిస్తున్న సహాయం లో భాగంగా చివరి విడతలో భాగంగా డబ్బులు జమ చేయనుంది. కాగా మొదటి రెండు విడతల్లో ఖాతాల్లో డబ్బులు వేసిన కేంద్రం ఈ సరి కూడా జమ చేయనుంది.