కృత్రిమ కాలులో కూడబెట్టాడు.. చివరకు..!

కృత్రిమ కాలులో కూడబెట్టాడు.. చివరకు..!

కూటి కోసం కోటి విద్యలు అన్నారు... ఇక సంపాదన, కూడబెట్టడం అనేక రకాలు... సంపాదించిన బ్యాంకులు, బీరువాలు, పెట్టెలు, మరీ ఎక్కువైతే ప్లాట్లు, పొలాలు ఇలా కూడబెడుతుంటారు... కానీ, ఓ యాచకుడు తన కృతిమ కాలే దానికి అనువైన ప్రాంతం అనుకున్నాడు. తన కృత్రిమ కాలును లాకరుగా భావించాడేమో... ఏకంగా రూ.90 వేలను ఆ కాలులోనే దాచుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులో వెలుగు చూసింది... స్థానిక కంటోన్మెంట్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఫుట్‌పాత్‌పై షరీఫ్‌ సాబ్‌ అనే వృద్ధుడు భిక్షాటన చేసేవాడు... అయితే రెండు రోజుల క్రితం ఆ యాచకుడు మృతిచెందాడు... దీంతో షరీఫ్ సాబ్ మృతదేహాన్ని స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకోగా... అతని కృత్రిమ కాలులో డబ్బులు బయటపడ్డాయి. మృతదేహానికి ఉన్న కృత్రిమ కాలులో రూ.500, రూ.100, రూ.50, రూ.20 కరెన్సీ నోట్లు, నాణేలు గుర్తించి షాక్ అయ్యారు. ఇక లభ్యమైన డబ్బులు మొత్తం కొత్త కరెన్సీయే... వాటిని లెక్కించిన పోలీసులు... యాచకుడు షరీఫ్‌ సాబ్‌పై ఆరా తీశారు... ఆయన హైదరాబాద్ వాసి అని గుర్తించారు. మధుమేహంతో గాంగ్రెయిన్‌ బారిన పడి రెండు కాళ్లు కోల్పోయిన ఈయన... రెండున్నర దశాబ్దాలలు బెంగళూరులోనే ఉంటున్నాడు... దాతల సహాయంతో శస్త్రచికిత్స చేయించుకుని కృత్రిమ కాళ్లతో భిక్షాటన చేసుకునేవాడు షరీఫ్‌ సాబ్‌... మృతదేహం దగ్గర లభ్యమైన కొన్ని పేపర్ల ఆధారంగా హైదరాబాద్ వాసిగా గుర్తించిన పోలీసులు... హైదరాబాద్‌లోని షరీష్ సోదరుడికి సమాచారం అందించారు. రెండు కాళ్లు కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో కుటుంబానికి దూరమైన ఈ యాచకుడు... చివరకు తన కృతిమ కాలులో వేలు కూడబెట్టి.. ప్రాణాలు వదిలాడు.