అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు

అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు

తెలంగాణలో మరో ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగింది. ఇవాళ మధ్యాహ్నం మంచిర్యాల పట్టణం నుంచి చెన్నూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు కల్వర్టును ఢీకొట్టి పక్కకు ఒరిగిపోయింది. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 70 మంది ఉన్నట్టు తెలిసింది. గాయపడిన వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.