తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన ప్రమాదం

తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన ప్రమాదం

తిరుపతి నుంచి తిరుమల వెళుతున్న ఆర్టీసీ బస్సుకు కనుమ రహదారిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు వినాయకస్వామి ఆలయం దాటిన తరువాత అదుపుతప్పి కారును ఢీకొట్టి లోయ వైపు దూసుకెళ్లింది. చెట్టుకొమ్మలు, వృక్షాలు అడ్డుగా ఉండటంతో బస్సు రహదారి పిట్టగోడపై నిలిచిపోయింది.ఈ ప్రమాదంలో పది మంది భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. బస్సు కాస్త ముందుకు వెళ్లి ఉంటే తమ ప్రాణాలు పోయేవని ప్రయాణికులు తెలిపారు.