నల్లగొండ జిల్లాలో బస్సు బోల్తా

నల్లగొండ జిల్లాలో బస్సు బోల్తా

నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 18 మందికి గాయాలు కాగా, నలుగురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ప్రకాశం జిల్లా కందుకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గురువారం రాత్రి 37 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌ బయల్దేరింది. శుక్రవారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో బుగ్గబావిగూడెం సమీపంలోకి రాగానే వేగంతో వెళ్తున్న కంటైనర్‌ను తప్పించే క్రమంలో బోల్తాపడి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. అంతా బురదమయంగా ఉండటంతో పలువురు ప్రయాణికులు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు.