భారీగా పెరిగిన టికెట్ ధరలు.. హైదరాబాద్ నుంచి విజయవాడకు... 

భారీగా పెరిగిన టికెట్ ధరలు.. హైదరాబాద్ నుంచి విజయవాడకు... 

53 రోజుల సమ్మె తరువాత కార్మికులను కెసిఆర్ మందలించి పెద్దమనసుతో తిరిగి విధుల్లోకి తీసుకున్నారు.  విధుల్లోకి తీసుకున్న కార్మికులకు సెప్టెంబర్ మాసం జీతాలను కూడా ఇచ్చేశారు.  ఇక గత శనివారం రోజు నుంచి బస్సులు మాములుగా తిరుగుతున్నాయి.  ఆదివారం రోజున ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.  ఈ సమావేశంలో ఆర్టీసీ గురించి అన్ని విషయాలను మాట్లాడతాడు.. ఆర్టీసీ టికెట్ రేట్లు పెంచాలని చెప్పాడు.  చెప్పినట్టుగానే కిలోమీటర్ కు 20 పైసలు చొప్పున టికెట్ ధరలు పెరిగాయి.  

కనీస టికెట్ ధరలు ఐదు నుంచి పది, డీలక్స్, సూపర్ డీలక్స్ బస్సుల్లో రూ. 20, రూ. 25, రాజధాని, గరుఢ, గరుఢ ప్లస్ లలో రూ.35, వెన్నెల స్లీపర్ బస్సుల్లో కనీస చార్జీ రూ. 70 వరకు పెరిగింది.  ఈ చార్జీల పెరుగుదలతో దూరప్రయాణం చేసే ప్రయాణికులపై అదనంగా ఎక్కువ భారం పడబోతున్నది.  సవరించిన చార్జీల ప్రకారం ఏ ఊరికి ఎంతమేర చార్జీలు పెరిగాయో ఇప్పుడు చూద్దాం.