అర్ధరాత్రి నుంచి పెరగనున్న టీఎస్‌ఆర్టీసీ ఛార్జీలు

అర్ధరాత్రి నుంచి పెరగనున్న టీఎస్‌ఆర్టీసీ ఛార్జీలు

ఇవాళ అర్ధరాత్రి నుంచి టీఎస్‌ఆర్టీసీలో ఛార్జీలు పెరగనున్నాయి. తొలుత డిసెంబర్‌ 2 నుంచి ఛార్జీల పెంపు ఉంటుందని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అయితే టికెట్‌ యంత్రాల్లో మార్పులకు ఒకరోజు సమయం పట్టే అవకాశం ఉండడంతో అధికారులు వాయిదా వేశారు. పెరిగిన ఛార్జీలు డిసెంబర్‌ 3 నుంచి...అంటే ఇవాళ అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. ఛార్జీల పెంపుపై అధికారులు కసరత్తు కొనసాగిస్తున్నారు. పెరిగిన ఛార్జీల పట్టికను అధికారులు ఇవాళ విడుదల చేస్తారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ మనుగడ సాగించాలంటే ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ ఇటీవలే వివరించారు. కిలోమీటర్‌కు 20 పైసలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై అధికారులకు వెంటనే అదేశాలు ఇచ్చారు. ఛార్జీలు పెంచడం ద్వారా ఏడాదికి 750 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.