విధి నిర్వహణలో ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు

విధి నిర్వహణలో ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు

విశాఖ జిల్లా పాడేరులో విషాదం నెలకొంది. విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ కు తీవ్ర గుండెపోటు రావడంతో నొప్పిని భరిస్తూ ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాడు. బస్సును పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు చేర్చి సంతకం పెట్టి డ్యూటీ దిగి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి సిబ్బంది అతడిని వెంటనే స్థానిక ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని ఆస్పత్రి మార్చూరిలో భద్రపరిచి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. 

విశాఖ జిల్లా నాతవరానికి చెందిన నాతవరానికి చెందిన ఈఎస్‌.నారాయణ పాడేరు ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం పాడేరు–అరుకు మార్గంలో నైట్‌డ్యూటీ విధులకు వెళ్లాడు. తిరిగి శనివారం మధ్యాహ్నం అరుకు నుంచి పాడేరుకు 40 మంది ప్రయాణికులతో వస్తుండగా పాడేరుకు ఐదు కిలోమీటర్ల దూరంలో చింతలవీధికి చేరుకునే సరికి డ్రైవర్‌ నారాయణకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. మృతుడు నారాయణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.