నేడు ఆర్టీసీ సమ్మె...

నేడు ఆర్టీసీ సమ్మె...

ఆర్టీసీలో మరోమారు సమ్మె సైరన్‌ మోగింది. మోటారు వాహన చట్టం సవరణ బిల్లు–2016కు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు మంగళవారం బంద్‌కు పిలుపునిచ్చాయి. మోటారు వాహన చట్టం బిల్లుకు వ్యతిరేకంగా భారత రోడ్డు రవాణా సంస్థల సమన్వయ కమిటీ దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చారు. ఇంతకుముందే ఆగస్టు 7న సమ్మె చేస్తున్నట్లు యాజమాన్యానికి టీఎంయూ నోటీసులిచ్చింది. ఈయూ, ఎన్‌ఎంయూ వంటి 9 ఆర్టీసీ యూనియన్లు ఈ సమ్మెకు మద్దతు ప్రకటించాయి. లారీల సంఘాలు కూడా బంద్‌కు మద్దతునిచ్చాయి. ఈ బంద్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి.

ఈ బంద్ ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొననున్నారు. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆర్టీసీ ఇంతవరకూ ప్రకటన చేయలేదు. బంద్‌ వల్ల హైదరాబాద్ నగర ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా రద్దీ ఉన్న మార్గాల్లో అదనపు సర్వీసులు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ అధికారులు చర్యలు చేపట్టారు.