ఆర్టీసీ జేఏసీ నేతల కీలక భేటీ

ఆర్టీసీ జేఏసీ నేతల కీలక భేటీ

ఆర్టీసీ కార్మికుల సమ్మె 46వ రోజుకు చేరింది. ఇవాళ అన్ని డిపోల ముందు కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సమ్మెపై ఆర్టీసీ జేఏసీ నేతలు, అఖిలపక్ష నేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశం అనంతరం భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించనున్నారు. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ, వేతనాల పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ సమావేశంలో సమ్మె కొనసాగింపుపై నిర్ణయం ప్రకటించే అవకాశముంది. కేసును హైకోర్టు లేబర్ కోర్టుకు బదిలీ చేయడంపై చర్చించనున్నారు.