ఇళ్ల ముట్టడి…భద్రతా వలయంలోకి నేతల ఇళ్ళు

ఇళ్ల ముట్టడి…భద్రతా వలయంలోకి నేతల ఇళ్ళు

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిరవధిక సమ్మె చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా తెరాస నాయకుల, ప్రజాప్రతినిధుల, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తున్నారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుంటూ కట్టడి చేస్తున్నారు. తెలంగాణ మంత్రుల క్వార్టర్స్ పోలీసు భద్రత వలయంలోకి వెళ్లిపోయింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మంత్రుల క్వార్టర్స్ ముట్టడికి ఆర్టీసీ కార్మికులు వస్తారని భావించిన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, క్యూఆర్టీ సాయుధ పోలీసు బలగాలతో మంత్రుల నివాస ప్రాంగణాల వద్ద భద్రతను మోహరించారు. ఇక హైదరబాద్ కాకుండా ఊళ్లలో కార్మికులకు -పోలీసులకు మధ్య తోపులాట, ఘర్షణలు జరిగాయి. కొన్ని చోట్ల పోలీసులు లాఠీ చార్జి కూడా చేశారు. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు నివాసాన్ని ముట్టడించే ప్రయత్నంలో జరిగిన తోపులాటలో మహిళా కండక్టర్ గాయపడింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటి వద్ద పరిస్థితి కూడా ఉద్రిక్తంగా మారింది. ఇక్కడా తోపులాట జరిగింది.