భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ

భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ

ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. రేపు మంత్రులు, ఎమ్మెల్యేల ఇంటి ముందు నిరసనలకు దిగాలని పిలుపునిచ్చింది. 13, 14న ఢిల్లీలో మానవహక్కుల కమిషన్‌ను కలుస్తామని, 18న సడక్‌ బంద్‌ను నిర్వహిస్తామని జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఈయూ కార్యాలయంలో జేఏసీ, అఖిలపక్ష నేతల భేటీ ముగిసిన అనంతరం అశ్వత్థామరెడ్డి మాట్లాడారు. నిన్న చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమంలో పాల్గొన్నది ఆర్టీసీ కార్మికులు, ప్రజసంఘాల కార్యకర్తలే తప్పా మావోయిస్టులు కాదని చెప్పారు. మావోయిస్టులు పాల్గొన్నారని పోలీసులు ఆపాదించొద్దన్నారు. ప్రభుత్వం కోర్టు ఆదేశాలను గౌరవించాలని అశ్వత్థామరెడ్డి అన్నారు. పంతానికి వెళ్లకుండా సీఎం చర్చలకు పిలవాలని అన్నారు. చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నించాలని అశ్వత్థామరెడ్డి అన్నారు.