బిగ్ ఫైట్ : చేస్తామని కార్మికులు.. అడ్డుకుంటామని పోలీసులు 

బిగ్ ఫైట్ : చేస్తామని కార్మికులు.. అడ్డుకుంటామని పోలీసులు 

ఇప్పుడు అందరి చూపులు హైదరాబాద్ వైపు ఉన్నాయి. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ లో జనవర్షం కురవబోతున్నది.  కార్మికులను ట్యాంక్ బండ్ పై నడవనివ్వమని పోలీసులు అంటున్నారు.  చలో టాంక్ బండ్ కు అనుమతి ఇవ్వలేదని, అనుమతి లేకుండా మార్చ్ చేస్తే అడ్డుకొని అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు.  ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే రేపు జరిగే చలో ట్యాంక్ బండ్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని అంటున్నారు కార్మికులు.  

రేపటి చలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి కార్మికులతో పాటుగా రాజకీయ పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి.  జనసమీకరణ భారీగానే జరగొచ్చు.  ఏఏ పార్టీలు మద్దతు ఇస్తాయి..ఎంతమంది ట్యాంక్ బండ్ కు తరలి వస్తారు అన్నది రేపు తేలిపోతుంది.  ఒకవేళ చలో ట్యాంక్ బండ్ కార్యక్రమం విజయవంతమైతే.. ప్రభుత్వానికి పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు.