బస్ భవన్ లో ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారుల సమావేశం...

బస్ భవన్ లో ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారుల సమావేశం...

హైదరాబాద్ బస్ భవన్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారుల ఈ రోజు సమావేశం అయ్యారు. ఏపియస్ ఆర్టీసీ నుండి ముగ్గురు ఈడిలు, ఆపరేషన్ హెడ్ బ్రహ్మానంద రెడ్డితో పాటు పలువురు ఉన్న తాధికారులు హాజరయ్యారు. కరోనా కారణంగా ఆగిపోయిన అంతరాష్ట్ర సర్వీసుల రాకపోకల పై ఈ సమావేశం లో చర్చిస్తున్నారు.  జూన్ 24న జరగాల్సిన ఈ సమావేశం పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది. దేశాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా మార్చి మూడో వారం లో లాక్ డౌన్ విధించాయి రాష్ట్ర ప్రభుత్వాలు. దాంతో అప్పటినుండి తెలంగాణ, ఏపీ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. ఇక ఈరోజు జరిగే చర్చలతో అంతరాష్ట్ర సర్వీసుల పునరుద్ధరణ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.