శివారు ప్రాంతాల్లో ఆర్టీసీ సర్వీసులు షురూ.. సిటీలో ఎప్పుడు..?

శివారు ప్రాంతాల్లో ఆర్టీసీ సర్వీసులు షురూ.. సిటీలో ఎప్పుడు..?

కరోనా లాక్‌డౌన్‌తో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు క్రమంగా రోడ్డెక్కుతున్నాయి.. ఇప్పటికే అంతర్‌ జిల్లా బస్సు సర్వీసులు, జిల్లాలో బస్సు సర్వీసులు అందుబాటులోకి రాగా.. హైదరాబాద్‌ సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో మాత్రం బస్సులు ప్రారంభానికి నోచుకోలేదు. అయితే, ఇవాళ్టి నుంచి హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లోనూ ఆర్బీసీ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ సబర్బన్, ముఫిసిల్ సర్వీసులు ఈరోజు తెల్లవారు జాము నుంచి రోడ్డెక్కాయి... 200లకు పైగా బస్ ట్రిప్ సర్వీసులను ప్రారంభించింది గ్రేటర్ ఆర్టీసీ.. కానీ, హైదరాబాద్ సిటీలో నడిచే సిటీ బస్సులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు... దీనిపై రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.. అయితే, సిటీ సర్వీసులకు సంబంధించిన అన్ని బస్సు డిపోలను అలర్ట్ చేశారు అధికారులు.. సిద్ధంగా ఉండాలంటూ డ్రైవర్లు, కండక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు ఆర్టీసీ ఉన్నతాధికారులు. మొత్తానికి ఈ నెలాఖరులోగా సిటీ బస్సులు కూడా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.