కొత్త ఆఫర్ల కోసం.. కొంటెపిల్ల ఇలా..!!

కొత్త ఆఫర్ల కోసం.. కొంటెపిల్ల ఇలా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వారానికొక కొత్త సినిమా రిలీజ్ అవుతుంటే.. నెలకు నలుగురైదుగురు కొత్త హీరోయిన్లు పరిచయం అవుతున్నారు.  కొత్త కొత్త హీరోయిన్లు పరిచయం అవుతున్నా.. అందులో ఎందరు నిలబడతారు అన్నది వాళ్ళ టాలెంట్ ను బట్టి..  అదృష్టాన్ని బట్టి ఉంటుంది.  ఒక సినిమా హిట్టయితే చాలు.. అవకాశాలు అవే వస్తాయి అనుకునే రోజులు పోయాయి.  

సినిమా హిట్టయినా.. కొత్త సినిమాల్లో అవకాశాలు రావాలంటే.. సోషల్ మీడియాలో పాపులర్ కావాలి.  కొత్త కొత్త ఫొటోలతో.. సోషల్ మీడియాలో లైక్స్, షేర్స్ ను సొంతం చేసుకోవాలి.  అప్పుడే పాపులర్ కావొచ్చు.  దీపం ఉండగానే చక్కబెట్టుకోవాలి అన్న సామెతను ఇప్పటి హీరోయిన్లు అవకాశం వచ్చినపుడే సోషల్ మీడియాలో పాపులర్ కావాలి అనే విధంగా మార్చుకుంటున్నారు.  

చిలసౌ సినిమా గుర్తుంది కదా... ఆ సినిమా ద్వారా రుహాని శర్మ వెండితెరకు పరిచయం అయింది.  చిలసౌ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నా.. ఇప్పటి వరకు ఈ భామకు మరో ఆఫర్ రాలేదు.  అందుకే అందరి హీరోయిన్లలా సోషల్ మీడియాను ఆసరా చేసుకుంది.  రీసెంట్ గా ఓ ఫోటోను షేర్ చేసింది.  క్యాజువల్ గా ఉండే షర్ట్ లో తళుక్కుమంది.  షర్ట్ రెండు బటన్స్ విప్పేసి.. మూడో బటన్ కూడా విప్పేస్తున్నా.. అంటూ కవ్విస్తున్నట్టుగా ఉంది ఆ ఫోటో.  ఇంకేముంది.. కుర్రకారు ఊరుకుంటారా చెప్పండి.. ఫోటోను లైక్ చేస్తున్నారు.