ఈ రూలర్... కార్పొరేట్ లీడర్ 

ఈ రూలర్... కార్పొరేట్ లీడర్ 

బాలకృష్ణ హీరోగా చేస్తున్న రూలర్ సినిమా ప్రమోషన్ షురూ చేసుకున్నది.  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ఇందులో బాలయ్య కొత్త లుక్ తో అదరగొడుతున్నాడు. ఇందులో బాలయ్య డిఫరెంట్ గెటప్స్ తో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.  ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. 

అడుగడుగో యాక్షన్ హీరో అనే పల్లవితో సాగే సాంగ్ పక్కా యాక్షన్ సాంగ్ లానే ఉన్నది.  ఇందులో బాలయ్య క్యారెక్టర్ గురించి వర్ణిస్తూ సాంగ్ ను షూట్ చేశారు.  క్లాస్ మాస్ అందరిని ఆకట్టుకునే విధంగా ఉన్నది సాంగ్.  మ్యూజిక్ తో పాటుగా లిరిక్స్ కూడా క్యాచీగా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.  క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.