'రూలర్‌' ట్రైలర్‌.. గర్జించిన నటసింహ

'రూలర్‌' ట్రైలర్‌.. గర్జించిన నటసింహ

నటసింహ నందమూరి బాలకృష్ణ అంటేనే వెంటనే గుర్తుకు వచ్చేది పవర్ పుల్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్, మాస్ సీన్స్.. ఇక తన ఫ్యాన్స్ అభిరుచికి అనుగుణంగా తన సినిమాలో ఇవి ఉండేటు చూసుకుంటారు బాలయ్య. తాజా చిత్రం రూలర్‌లోనూ వీటికి కొదవలేదని స్పష్టమవుతోంది... కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో ఈ నెలలో ‘రూలర్‌’గా ప్రేక్షలను పలకరించనున్నారు బాలయ్య. ఇప్పటికే సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్స్‌ పోస్టర్స్, టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ రాగా.. ఇవాళ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.. ఈమూవీలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తుండగా.. బాలయ్య ఫ్యాన్స్ ఆశించే అన్నీ ఈ మూవీలో పుష్కలంగా కనిపిస్తున్నాయి.

ఎవరికిరా ఫోన్ చేస్తున్నావు? ఫైరింజన్‌కా..? కాదు.. ఆ ఫైర్‌కే అంటూ వచ్చే రిప్లేతో ప్రారంభమైన ట్రైలర్‌లో అన్ని కోణాలను చూపించాడు దర్శకుడు.. ఇక, నటసింహ ఎంట్రీ కూడా పవర్ పుల్‌గా చిత్రీకరించారు... ఎమోషనల్ డైలాగ్స్, మసాలాకు కూడా కొదవేమీలేదు. "ఈ ధాన్యం తింటున్న మీరే ఇంత పొగరు చూపిస్తుంటే... దీనిని పండించిన రైతుకు ఇంకెంత పవరు.. పొగరు ఉంటుందో చూపించమంటవా’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్‌ హైలెట్‌గా ఉండగా... "పార్సిల్ చేయడానికి ఇది దెబ్బతిన్న సింహంరా..! అంత తొందరగా చావదు.. వెంటాడి, వేటాడి చంపుద్ది'' అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు విడుదలైన కొద్దిసేపటి నుంచే యూట్యూబ్‌లో వ్యూస్‌తో దూసుకుపోతోంది రూలర్ ట్రైలర్. ఇక, ఈ నెల 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రూలర్‌ను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది చిత్ర యూనిట్.. ఈ సినిమాలో బాల‌య్య సరసన వేదిక‌, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. భూమికా చావ్లా, జ‌య‌సుధ‌, ప్రకాష్ రాజ్ తదితరలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హ్యాపీ మూవీస్ ప‌తాకంపై నిర్మాత సి.క‌ళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందిస్తున్నాడు.