ఈ రూమర్లేంటి బన్నీ !

ఈ రూమర్లేంటి బన్నీ !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వరుసగా రెండు కొత్త సినిమాలకి సైన్ చేసి ఉన్నారు.  వాటిలో ఒకటి త్రివిక్రమ్ డైరెక్షన్లో కాగా, ఇంకొకటి సుకుమార్ సారథ్యంలో ఉండనుంది.  ఇలా బన్నీ రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉండగా మీడియాలో పుట్టుకొచ్చిన ఒక రూమర్ సంచలనంగా మారింది.  బన్నీ, ఆయన తండ్రి అల్లు అరవింద్ నడుమ వివాదాలు తలెత్తాయనేది ఆ వార్తల సారాంశం.  అందుకే బన్నీ వేరొక ఆఫీస్ పెట్టుకుని సొంతగా సినిమా పనుల్ని చూసుకుంటున్నాడని, అరవింద్ కూడా బయటి హీరోలతో చిత్రాలు చేసేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు.  దీంతో ప్రేక్షకుల్లో, బన్నీ అభిమానుల్లో కంగారు మొదలైంది.  ఈ వార్తలు మరింత విజృంభించక ముందే గీతా ఆర్ట్స్ కాంపౌండ్ స్పందించడం మంచిది.