శ్రీదేవిది సహజ మరణం కాదు.. హత్య ?

శ్రీదేవిది సహజ మరణం కాదు.. హత్య  ?

నటి శ్రీదేవి గతేడాది దుబాయ్‌లో ఓ హోటల్లో బాత్‌టబ్‌లో పడి మరణించిన సంగతి తెలిసిందే.  అది సహజ మరణమని బోనీ కపూర్ సహా కుటుంబ సభ్యులంతా అంటున్నా అనేక అనుమానాలు తలెత్తాయి.  ఇప్పటికే ఆమె మరణం ఒక మిస్టరీగానే మిగిలింది.  తాజాగా శ్రీదేవి మరణంపై స్పందించిన కేరళ జైళ్ల శాఖ డీజీపీ రిషిరాజ్ సింగ్ అది హత్యని అంటూ కొత్తవాదనను తెరపైకి తెచ్చారు.  

తన స్నేహితుడైన ఫొరెన్సిక్ నిపుణుడు డాక్టర్ ఉమదత్తన్ మాటల మేరకు శ్రీదేవిది సహజ మరణంలా అనిపించట్లేదని రిషిరాజ్ అన్నారు.  దీంతో దేశవ్యాప్తంగా మరోసారి శ్రీదేవి మరణంపై చర్చ మొదలైంది.  కానీ ఆమె భర్త బోనీ కపూర్ మాత్రం హత్య అంటున్నవారి ప్రశ్నలన్నీ ఊహాజనితమైనవేనని వాదనను కొట్టిపారేశారు.