భద్రత కల్పించమని కొత్త జంట కోర్టుకెళితే... రూ. 10వేలు ఫైన్ వేశారు... ఎందుకంటే... 

భద్రత కల్పించమని కొత్త జంట కోర్టుకెళితే... రూ. 10వేలు ఫైన్ వేశారు... ఎందుకంటే... 

పెళ్లి చేసుకున్న కొత్త జంట హనీమూన్ కు వెళ్తారు లేదంటే ఏ గుడికో, మరో ప్రాంతానికో వెళ్తారు.  కానీ, ఈ కొత్త జంట మాత్రం పెళ్లి చేసుకున్న వెంటనే కోర్టుకు వెళ్లారు.  అలా కోర్టుకు వెళ్లిన కొత్త జంటకు కోర్టు రూ. 10వేలు ఫైన్ వేసింది.  ఈ సంఘటన పంజాబ్ లో జరిగింది.  అసలు విషయంలోకి వెళ్తే... 

ఇంట్లో పెద్దలకు తెలియకుండా కొత్త జంట పెళ్లి చేసుకున్నారు.  పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడంతో ఎక్కడ ఎటాక్ చేస్తారో అనే భయంతో ఈ పనిచేశారు. అయితే , కోర్టుకు వెళ్లిన ఈ కొత్త జంట ఫోటోలను పరిశీలించి కోర్టు రూ.10వేల రూపాయల ఫైన్ వేసింది.  ఎందుకు వైన్ వేసిందని విషయం తెలిస్తే అందరూ షాక్ అవుతారు.  

కొత్త జంట పెళ్లి చేసుకునే సమయంలో ఎలాంటి మాస్క్ వినియోగించలేదు.  మాస్క్ లేకుండా బయటకు వస్తే భారీ ఫైన్ వేస్తామని ఇప్పటికే ప్రభుత్వాలు చెప్తున్నాయి.  ఈ జంట పెళ్లి హడావుడిలో పడిపోయి మాస్క్ పెట్టుకోవడం మర్చిపోయారు.  దీంతో ఆ జంటకు రూ.10వేలు ఫైన్ వేశారు.  15 రోజుల్లోగా ఈ ఫైన్ ను చెల్లించాలని, ఆ ఫైన్ ను హోమియాపూర్ డిసిలో చెల్లించాలని, డిపాజిట్ డబ్బులను మాస్కుల తయారీకి వినియోగించాలని కోరారు.