బిగ్ న్యూస్: పుతిన్ కూతురికి రష్యా మొదటి వాక్సిన్... 

బిగ్ న్యూస్: పుతిన్ కూతురికి రష్యా మొదటి వాక్సిన్... 

ఆగష్టు 12 వ తేదీన రష్యా వాక్సిన్ రిలీజ్ కాబోతున్నది.  రేపు వాక్సిన్ ను రిజిస్టర్ చేయించబోతున్నారు. ఈ వాక్సిన్ పై ఇప్పటికే మూడో దశ ట్రయల్స్ కూడా నిర్వహించారు.  వాక్సిన్ ను పనితనంపై ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్నది.  అమెరికా ఈ వాక్సిన్ ను తమ దేశంలో వినియోగించబోమని అంటోంది.  వాక్సిన్ పై రష్యా సరైన ప్రమాణాలు పాటించడం లేదని, రష్యా వాక్సిన్ వలన ప్రమాదం ఉండొచ్చనే సందేహాలను వెలుబుచ్చింది.  

వీటన్నింటికి చెక్ పెట్టేందుకు రష్యా సిద్ధం అయ్యింది.  వాక్సిన్ ను రిజిస్టర్ చేసే ముందే దీనిని రష్యా అధ్యక్షుడు పుతిన్ కూతురికి ఇచ్చినట్టు అధికారికంగా ప్రకటించారు.  పుతిన్ కూతురు వాక్సిన్ తీసుకున్నాక ఆరోగ్యంగానే ఉన్నారని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కలగలేదని రష్యా అధికారికంగా ప్రకటించింది.  అన్ని రకాల ప్రమాణాలను పాటించిన తరువాతే వాక్సిన్ ను రిలీజ్ చేస్తున్నట్టు రష్యా ఆరోగ్యశాఖ తెలియజేసింది.