24 గంటల్లో రష్యాలో ఎన్ని కరోెనా కేసులో తెలుసా?

24 గంటల్లో రష్యాలో ఎన్ని కరోెనా కేసులో తెలుసా?

మాస్కో: ప్రతి దేశంలోనూ కరోనా తన కబంద హస్తాలను మరింతగా చాస్తోంది. రోజురోజుకు దీని బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. వ్యాక్సిన్‌ను పూర్తి చేశామన్న రష్యాలో గత 24 గంటల్లో 16,521 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఉదయం నుంచి 17,340 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ రష్యాలో మొత్తం 1,497,167 మంది కరోనా బారిన పడ్డారు. ఇది ఆ దేశ జనాభాలో 25.8 శాతం. అయితే చాలా మందిలో ఎటువంటి లక్షణాలు కనిపించడంలేదని, వారిపై ఏదో అనుమానంతో చేసిన పరీక్షల్లో చాలా మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని ప్రకటించారు. ఇప్పటివరకు మాస్కోలో నమోదైన అత్యధిక కేసులు 12 గంటల్లో 4,453 అని తెలిపారు. అయితే ఈ రికార్డు నిన్న సాయంత్రం నుంచి అక్టోబరు 24 ఉదయంలోపు నమోదయిందని పేర్కొన్నారు. అంతేకాకుండా 24 గంటల్లో 296 మంది మరణించారని దీంతో రాష్యాలోని మరణాల సంఖ్య 25,821కి చేరిందని తెలిపారు. దీంతో పాటు 11,567 మంది కరోనా నుంచి కోలుకున్నారని తెలిపింది.