రష్యా కొత్త ప్రతిపాదన:స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ను ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ తో జోడిస్తే... 

రష్యా కొత్త ప్రతిపాదన:స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ను ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ తో జోడిస్తే... 

ప్రపంచంలోనే మొదటి టీకాను రష్యా తయారు చేసింది.  స్పుత్నిక్ వి పేరుతో వ్యాక్సిన్ ను రిలీజ్ చేసింది.  అయితే వ్యాక్సిన్ కి సంబంధించి ఎలాంటి డేటాను బయటకు ఇవ్వకపోవడంతో స్పుత్నిక్ వి టీకాపై సందేహం వ్యక్తం చేశాయి. స్పుత్నిక్ వి టీకా మరోసారి ట్రయల్స్ ను నిర్వహించింది.  దాదాపుగా 50 దేశాలు స్పుత్నిక్ వి వ్యాక్సిన్ పై ఆసక్తి కనబరుస్తున్నాయి.  ఇక ఇదిలా ఉంటె, ఆక్స్ ఫర్డ్-అస్త్రజెనాక ఫార్మా కలిసి సంయుక్తంగా టీకాను తయారు చేస్తున్నాయి.  అయితే, ట్రయల్స్ సమయంలో కొన్ని సమస్యలు ఉత్పన్నం అయ్యాయి.  మొదటి డోస్ ఇచ్చినపుడు 91శాతం, రెండో డోస్ ఇచ్చిన తరువాత 62శాతం మాత్రమే సమర్ధత కనిపించింది.  మరింత లోతైన పరిశోధన చేసేందుకు మరోసారి ఆక్స్ ఫర్డ్ సంస్థ ట్రయల్స్ ను నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది.  అయితే రష్యా ఓ ప్రతిపాదనను తీసుకొచ్చింది.  ఆక్స్ ఫర్డ్ టీకాను స్పుత్నిక్ వి తో కలిపి ట్రయల్స్ గా నిర్వహిస్తే సమర్ధవంతమైన ఫలితాలు వస్తాయని చెప్పింది. దీనిపై ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం ఇప్పటివరకు స్పందించలేదు.