మొన్న నాసా... నేడు రష్యా... యూఎఫ్ఓలపై ఇలా...!!

మొన్న నాసా... నేడు రష్యా... యూఎఫ్ఓలపై ఇలా...!!

ఫ్లైయింగ్ సాసర్ల గురించి ఎలాంటి న్యూస్ బయటకు వచ్చినా ఆసక్తికరంగా ఉంటుంది.  ఫ్లైయింగ్ సాసర్లలో ఏలియన్స్ ప్రయాణం చేస్తుంటారని, మనుషులకన్నా ఏలియన్స్ టెక్నాలజీ పరంగా ఉన్నత స్థితిని సాధించారని చెప్తుంటారు.  అయితే, నాసా కొన్ని రోజుల క్రితం వరకు వీటిని ఖండిస్తూ వచ్చింది.  అయితే,  అమెరికన్ ఆర్మీ విమానాలు యూఎఫ్ఓ లను షూట్ చేసింది.  దానికి సంబంధించిన వీడియోలను నాసా రిలీజ్ చేయడంతో యూఎఫ్ఓ లు ఉన్నాయని నమ్మడం మొదలుపెట్టారు.  అంతేకాదు, అమెరికన్ ఆర్మీ, నాసా, పెంటగాన్ సంస్థలు అరిజోనాలోని ఏరియా 51 ప్రాంతంలో ఏలియన్స్ పై ప్రయోగాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.  ఇక ఇదిలా ఉంటె, తాజాగా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ లో ఉన్న రష్యా వ్యోమగామి ఇవాన్ వాగ్నర్ అరోరా బొరియర్స్ ను వీడియో తీస్తుండగా ఐదు యూఎఫ్ఓ లు  కనిపించాయి.  భూమికి దక్షిణ భాగంలోని అంతరిక్షంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.  దీనికి సంబంధించిన వీడియోలను అనాలసిస్ కోసం పంపినట్టు రష్యన్ స్పేస్ ఏజెన్సీ తెలియజేసింది.