బికినీలో కరోనా రోగులకు చికిత్స... సోషల్ మీడియాలో వైరల్...!!

బికినీలో కరోనా రోగులకు చికిత్స... సోషల్ మీడియాలో వైరల్...!!

కరోనా దేశవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.  ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా కరోనా వైరస్ అడుగుపెట్టింది.  అన్ని చోట్లా ప్రభావం చూపిస్తున్నది.  ఇక రష్యాలో రోజు రోజుకు వైరస్ వేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే.  రష్యా లో ఇప్పటి వరకు 3,08,705 మంది కరోనా బారిన పడగా, 2,972 మంది మరణించారు.  మరణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ కేసుల సంఖ్య మూడు లక్షలు దాటిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  

కరోనా రోజులకు వైద్యులు, నర్సులు నిత్యం సేవలు అందిస్తూనే ఉన్నారు.  కరోనా రోగులకు సేవలు అందించే వైద్యులు, నర్సులు తప్పనిసరిగా పీపీఈలు ధరించాలి.  వైరస్ నుంచి రక్షించబడాలి అంటే తప్పదు.  పీపీఈ ప్లాస్టిక్ తో తయారు చేసి ఉంటుంది.  వాటిని ధరిస్తే శరీరంలోపల వేడి అధికంగా ఉంటుంది. కానీ, తప్పదు.  అయితే, రష్యాలోని టూలా పట్టణంలో కోవిడ్ హాస్పిటల్ లో పనిచేస్తున్న మహిళ నర్స్ బికినీ, దానిపైన పీపీఈ ధరించి సేవలు అందిస్తోంది.  లోపల మాములు దుస్తులు ధరించి, దానిపై పీపీఈ వేసుకుంటే ఉక్కపోత పోస్తుందని అందుకే బికినీ వేసుకొని దానిపై పీపీఈ ధరించినట్టు ఆమె చెప్తున్నది.  రోగుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవని అంటోంది.  అయితే, దీనిపై ప్రభుత్వం మాత్రం మండిపడుతున్నది.  విచారణకు ఆదేశించింది