విచిత్ర బంధం: భర్తకు విడాకులు ఇచ్చి... కొడుకును పెళ్లాడిన భార్య...
మనిషి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. కొంతమంది జీవిత ప్రయాణం చాలా విచిత్రంగా ఉంటుంది. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న వ్యక్తులు సడెన్ గా విడిపోతుంటారు. ప్రత్యేకమైన కారణాలు అంటూ ఏమి ఉండవు. ఇలానే రష్యాకు చెందిన 35 ఏళ్ల మరీనా పదేళ్ల క్రిందట అర్రే అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరి వివాహం జరిగే నాటికి అర్రేకు పదేళ్ల కొడుకు ఉన్నాడు.
అర్రే కొడుకు వ్లాదిమీర్ ఈ పదేళ్ల కాలంలో మరీనాకు బాగా దగ్గరయ్యాడు. అర్రే నుంచి మరీనా వివాహం చేసుకున్నాక కూడా వ్లాదిమిర్ తన సవతి తల్లి మరీనాను చూసేందుకు వచ్చేవాడు. ఇంట్లో కావాల్సిన పనులు చేసిపెట్టేవాడు. ఇద్దరి మధ్య తల్లి కొడుకుల బంధం కంటే మించిన బంధం మరేదో ఉందని భావించిన మరీనా తన ఎం మనసులో విషయాన్ని వ్లాదిమిర్ కు చెప్పింది. వ్లాదిమిర్ ఆమెను వివాహం చేసుకునేందుకు ఒప్పుకున్నాడు. ఇద్దరి వివాహం ఇటీవలే జరిగింది. ఈ విషయం తెలిసిన మరీనా మాజీ భర్త షాక్ అయ్యాడు. భార్యగా మొన్నటి వరకు ఇంట్లో ఉన్న మరీనా ఇప్పుడు కోడలిగా ఇంటికి రావడం చూసి ఆశ్చర్యపోయాడు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)