ఐస్ హాకీ ఆడుతూ కిందపడ్డ రష్యా అధ్యక్షుడు

ఐస్ హాకీ ఆడుతూ కిందపడ్డ రష్యా అధ్యక్షుడు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఐస్ హాకీ ఆడుతూ కిందపడిపోయారు. ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ సందర్భంగా ప్రేక్షకులకు అభివాదం చేస్తూ అక్కడున్న రెడ్ కార్పెట్ పై పడిపోయారు. పక్కనే ఉన్న ఇద్దరు ఆటగాళ్లు పట్టుకునేందుకు ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. పుతిన్ తనంతట తానే లేచి మళ్లీ స్కేటింగ్ చేస్తూ ముందుకు వెళ్లారు. ప్రతి యేటా హాకీ మ్యాచ్‌లో పాల్గొనే పుతిన్... ఈ ఏడాది కూడా ఎనిమిది గోల్స్ స్కోర్ చేశారు.