ఆర్ఎక్స్ 100 తరువాత ఆ సినిమాలోనే..!!

ఆర్ఎక్స్ 100 తరువాత ఆ సినిమాలోనే..!!

ఆర్ఎక్స్ 100 సినిమా టాలీవుడ్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా నటించారు. బోల్డ్ అండ్ కల్ట్ మూవీగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్టైంది.  ఈ సినిమా తరువాత అనేక ఆఫర్లు వచ్చినా.. పాయల్ ఎందులోనూ నటించలేదు.  ఎన్టీఆర్ బయోపిక్ లో ఓ చిన్న పాత్ర చేసింది. ఆ తరువాత, ఇప్పుడు వెంకిమామలో హీరోయిన్ గా చేస్తుండటం విశేషం.  

వెంకిమామలో పాయల్ వెంకటేష్ కు జోడిగా నటిస్తోంది.  ఈ సినిమా షూటింగ్ గోదావరి జిల్లాలో ప్రారంభమైంది.  నాగచైతన్య మరో హీరో.  జైలవకుశ తరువాత దర్శకుడు బాబీ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.