పాపం ఆర్ఎక్స్ భామ పరిస్థితేంటో..!!

పాపం ఆర్ఎక్స్ భామ పరిస్థితేంటో..!!

ఆర్ఎక్స్ 100 సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.  కల్ట్ అండ్ బోల్డ్ కంటెంట్ తో తెరముందుకు వచ్చిన ఈ సినిమా మౌత్ టాక్ తోనే సినిమా హిట్ టాక్ వచ్చింది. పైగా ఇందులో హీరోయిన్ గా నటించిన పాయల్ రాజ్ పుత్ బోల్డ్ సన్నివేశాలకు ఏమాత్రం అడ్డు చెప్పలేదు.  కావాల్సినంత అందాలను ఆరబోసింది.  ఇంకేముంది యువత ఈ సినిమా కోసం క్యూ కట్టారు.  

ఆర్ఎక్స్ 100 హిట్ కావడంతో ఆమెకు వరసగా అవకాశాలు వచ్చాయని మీడియాలో వార్తలు వచ్చాయి.  మహేష్ తో నటించే ఛాన్స్ వచ్చిందని, అల్లు అర్జున్ తో సినిమా చేయబోతోందని వార్తలు వచ్చాయి.  అటు కోలీవుడ్ లో కూడా రెండు సినిమాలు చేస్తున్నట్టు వార్తలు వచ్చినా అందులో ఎంతవరకు నిజం ఉండనే విషయం ఇప్పటి వరకు స్పష్టం కాలేదు.  ఆర్ఎక్స్ 100 తరువాత ఈ భామ మరేసినిమాకు సైన్ చేయకపోవడం విశేషం.