ఆర్ ఎక్స్ 100 దర్శకుడి నెక్స్ట్ సినిమా కన్ఫర్మ్

ఆర్ ఎక్స్ 100 దర్శకుడి నెక్స్ట్ సినిమా కన్ఫర్మ్

ఆర్ఎక్స్ 100 సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో చెప్పక్కర్లేదు.  సినిమా సూపర్ హిట్ తరువాత వరసగా అవకాశాలు వస్తాయని అనుకున్నారు.  రామ్, దుర్క్యూర్ సల్మాన్, నాగచైతన్య వంటి వాళ్ళతో సినిమా చేయబోతున్నారని వార్తలు వచ్చాయి.  రీసెంట్ గా నాగచైతన్య..సమంతలతో సినిమా ఉంటుందని కూడా అనుకున్నారు.  

కానీ, ఇవి కేవలం పుకార్లే అని తేలిపోయింది.  అజయ్ భూపతితో నాగచైతన్య సినిమా చేయడం లేదని తేలిపోయింది.  మొదటి సినిమా సూపర్ హిట్టైన ఎందుకని అజయ్ తో సినిమా చేయడం లేదో అర్ధం కావడం లేదు.  ఇదిలా ఉంటె, సీత హీరో బెల్లంకొండ శ్రీనివాస్ దర్శకుడు అజయ్ భూపతితో సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు.  సీత ప్రమోషన్స్ సమయంలో ఆయన ఈ ప్రకటన చేయడం విశేషం.