'ఆర్ఎక్స్ 100' దర్శకుడి నెక్స్ట్ హీరో వివరాలు !

'ఆర్ఎక్స్ 100' దర్శకుడి నెక్స్ట్ హీరో వివరాలు !

ఈ ఏడాది విడుదలై ఘన విజయాన్ని అందుకున్న సినిమాల్లో 'ఆర్ఎక్స్ 100' కూడ ఒకటి.  చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం అనూహ్యరీతిలో భారీ విజయాన్ని దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.  ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అజయ్ భూపతి కూడ మంచి పేరు సంపాదించుకున్నారు. 

దీంతో ఈయనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు, హీరోలు ఉత్సాహం చూపుతున్నారు.  ఇప్పటివరకు తన రెండవ సినిమాను ప్రకటించని ఆయన ఎనర్జిటిక్ హీరో రామ్ తో తన నెక్స్ట్  సినిమా చేస్తారనే టాక్ వినబడుతోంది.  కొన్ని రోజుల క్రితమే జరిగిన అజయ్ భూపతి పెళ్ళికి హీరో రామ్ కూడ హాజరైన సంగతి తెలిసిందే.