బాలయ్య సినిమాలో 'ఆర్ఎక్స్ 100' భామ !

బాలయ్య సినిమాలో 'ఆర్ఎక్స్ 100' భామ !

పాయల్ రాజ్ ఫుత్.. ఇప్పుడు ఈ పేరు తెలీని తెలుగు సినీ అభిమాని ఉండడు.  'ఆర్ఎక్స్ 100' అనే ఒక్క సినిమాతో అంత పాపులారిటీ సంపాదించుకుంది పాయల్.  ఈ సినిమాలో ఆమె చేసిన హాట్ సీన్లకు కుర్రకారు ఫిదా అయిపోయింది.  అందుకే మంచి మంచి ఆఫర్లు ఆమె తలుపు తడుతున్నాయి. 

తాజాగా బాలక్రిష్ణ నటిస్తున్న 'ఎన్టీఆర్ కథానాయకుడు' చిత్రంలో కూడ ఆమెకు ఒక పాత్ర దొరికింది.  ఎన్టీఆర్ తో కలిసి అనేక సినిమాల్లో నటించిన కథానాయిక జయసుధ పాత్రను పాయల్ చేయనుంది.  క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2019 సంక్రాతి సందర్బంగా రిలీజ్ చేయనున్నారు.