ఆర్ఎక్స్ 100 తమిళ రీమేక్ హీరో ఎవరో తెలుసా !

ఆర్ఎక్స్ 100 తమిళ రీమేక్ హీరో ఎవరో తెలుసా !

ఈ మధ్యే విడుదలైన 'ఆర్ఎక్స్ 100' చిత్రం ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిన సంగతే.  ఏ ఇద్దరు కుర్రాళ్ళు మాట్లాడుకున్నా వారి నడుమ ఈ సినిమా టాపిక్ నడవాల్సిందే.  అంతగా ఆకట్టుకున్నది ఈ సినిమా కథ,  అందులోని హీరో పాత్ర.  అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కార్తికేయ హీరోగా నటించి మంచి ఫేమ్ సొంతం చేసుకున్నారు. 

ఇప్పుడీ హార్డ్ హిట్టింగ్ సినిమాను తమిళంలోకి రీమేక్ చేసే పనులు జరుగుతున్నాయి.  ఈ రీమేక్లో ఆది పినిశెట్టి కథానాయకుడిగా నటించనున్నాడు.  ఔరా సినిమాస్ నిర్మించనున్న ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు, కీలకమైన హీరోయిన్ పాత్రను ఏ నటి చేస్తుంది వంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.