'బాహుబలి-2' రికార్డును కూడ బద్దలు కొట్టిన 'ఆర్ఎక్స్ 100' !

'బాహుబలి-2' రికార్డును కూడ బద్దలు కొట్టిన 'ఆర్ఎక్స్ 100' !

ఒక చిన్న సినిమా మంచి విజయాన్ని సాధించడమే పెద్ద విషయమైన ఈరోజుల్లో ఇటీవలే విడుదలైన  'ఆర్ఎక్స్ 100' చిత్రం సక్సెస్ సాధించడమే కాదు ఏకంగా 'బాహుబలి 2' రికార్డును బద్దలు కొట్టేసింది.  దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన 'బాహుబలి 2' సినిమా పేరిట ఎన్నో రికార్డులున్నాయి.  ఆ రికార్డుల్లో హైదరాబాద్ సింగిల్ స్క్రీన్ దేవి 70 ఎమ్ఎమ్ మొదటి వారం గ్రాస్ రికార్డు కూడ ఒకటి. 

ఈ థియేటర్లో 'బాహుబలి 2' మొదటి వారంలో రూ.28,82,270ల గ్రాస్ ను కలెక్ట్ చేయగా 'ఆర్ఎక్స్ 100' చిత్రం ఫస్ట్ వీక్ లో రూ.29,32,867 గ్రాస్ రాబట్టి ఆ రికార్డును బ్రేక్ చేసింది.  దీన్నిబట్టి చిత్రం బి, సి సెంటర్లలో ఏ స్థాయిలో ఆడుతుందో అర్థమవుతోంది.  ఇప్పటికే పెట్టిన పెట్టుబడికి డబుల్ అమౌంట్ రాబట్టిన ఈ చిత్రం రాబోయే రోజుల్లో ఇంకా మంచి వసూళ్లను సాధించే సూచనలు కనిపిస్తున్నాయి.