రేర్ రికార్డును సొంతం చేసుకున్న సాహో...!!

రేర్ రికార్డును సొంతం చేసుకున్న సాహో...!!

ఆగష్టు 30 వ తేదీన రిలీజైన సాహో సినిమా ఇప్పటికే చాలా చోట్లా థియేటర్స్ నుంచి  బయటకు వచ్చేసింది. ఇలాంటి సమయంలో అనుకోని విధంగా ఓ రేర్ రికార్డును సొంతం చేసుకోవడం అంటే మాములు విషయం కాదు.  ఇప్పటి వరకు ఈ సినిమా దాదాపుగా రూ. 428 కోట్ల రూపాయలు వసూలు చేసింది.  డివైడ్ టాక్ లోనూ ఈ స్థాయిలో వసూలు సాధించడం అంటే మాములు విషయం కాదు. 

అయితే, ఈ మూవీ 16 వ రోజున నెల్లూరులో ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.  16 వ రోజున నెల్లూరులో ఈ మూవీ రూ. 1,85,796/- థియేటర్ షేర్ ను వసూలు చేసింది.  దీంతో బాహుబలి 1 రికార్డును సాహో బ్రేక్ చేసింది. ఇక మొదటి రోజు ఈ సినిమా నెల్లూరులో బాహుబలి 2 రికార్డును కూడా బ్రేక్ చేయడం విశేషం.