ప్రభాస్ దర్శకుడు కూడా పెళ్లి పీటలెక్కుతున్నాడు...
ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమా గతేడాది రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. దాదాపుగా రూ.300 కోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో పాన్ ఇండియా మూవీగా తీశారు. రన్ రాజా రన్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ప్రభాస్ తో సినిమా కూడా టేకింగ్ పరంగా మంచి పేరు తెచ్చిపెట్టింది. రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన సుజిత్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు.
చాలా కాలంగా సుజిత్ ఓ డెంటిన్ట్ ప్రేమలో ఉన్నాడు. ప్రేమించిన అమ్మాయినే ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు. లాక్ డౌన్ కాలంలో టాలీవుడ్ కు చెందిన చాలామంది పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ బాటలోనే ఇప్పుడు సుజిత్ కూడా నడుస్తున్నాడు. సుజిత్, డెంటిస్ట్ ప్రవల్లికల ఎంగేజ్మెంట్ కుటుంబ సభ్యుల సమక్షంలో జూన్ 10 వ తేదీన జరిగింది. వీరి వివాహం త్వరలోనే జరగబోతుననట్టు సమాచారం.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)