రూ. 350 కోట్ల క్లబ్ లో సాహో..!!

రూ. 350 కోట్ల క్లబ్ లో సాహో..!!

ఆగష్టు 30 వ తేదీన రిలీజైన సాహో డివైడ్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.  డివైడ్ టాక్ ను తెచ్చుకున్నప్పటికీ వసూళ్ల విషయంలో మాత్రం దూసుకుపోతున్నది.  వరసగా నాలుగు రోజులు సెలవులు కావడంతో కలెక్షన్లు భారీగా వచ్చాయి.  అయితే, నిన్నటి నుంచి వీక్ డేస్ కావడంతో కలెక్షన్ల పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నది.  నిన్నటి రోజున కలెక్షన్లు డ్రాప్ అయినా కొంత పర్వాలేదు.  

ఐదో రోజు నైజాంలో ఈ సినిమా 1.49 కోట్ల రూపాయలు వసూలు చేసింది.  ఐదు రోజుల్లో నైజాంలో ఈ సినిమా మొత్తం 24.76 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసిన సంగతి తెలిసిందే.  కాగా, ఈ ఐదు రోజుల్లో సాహో ప్రపంచవ్యాప్తంగా రూ. 350 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసింది.  డివైడ్ టాక్ లోను ఈ స్థాయిలో వసూలు చేయడం గ్రేట్ అని చెప్పాలి.  లాంగ్ రన్ లో సినిమా ఏ రేంజ్ లో వసూళ్లు సాధిస్తాయో చూడాలి.